![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -14 లో.....మహా, హారిక ఇద్దరిని గుడివెళ్లి కుల దైవానికి మొక్కులు చెల్లించి పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూడమని మొక్కుకొని రమ్మని వాళ్ళని ప్రతాప్ పంపిస్తాడు. చక్రిని కూడా వాళ్లతో పంపిస్తాడు. మరొకవైపు కన్నా వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ రమ్మన్నాడని మాధవ తనతో వెళ్తాడు. మీ కన్నా క్రికెట్ గ్రౌండ్ లో ఒక అతని తల పగులగొట్టాడని ప్రిన్సిపల్ చెప్పగానే మాధవ షాక్ అవుతాడు.
ఇలాంటి వాడు కాలేజీలో వద్దని ప్రిన్సిపల్ అంటాడు. దాంతో ఇంకెప్పుడు ఇలా చెయ్యడని ప్రిన్సిపల్ ని రిక్వెస్ట్ చేస్తాడు మాధవ. ఈ ఒక్క ఛాన్స్ ఇస్తున్నానని ప్రిన్సిపల్ అంటాడు. ఆ తర్వాత కన్నా బయటకు వచ్చాక మాధవ మందలిస్తాడు. మరోవైపు మహా, హారిక గుడికి వెళ్తారు. మహా డల్ గా ఒక దగ్గర కూర్చొని ఉంటే చక్రి వచ్చి మాట్లాడుతాడు. కాసేపటికి వంట చేస్తున్న మాధవకి చక్రి ఫోన్ చేసి నేను ఒక దగ్గర డైవర్ గా పని చేస్తున్నాను కదా.. అక్కడ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు.. ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నాను.. ఏదైనా సలహా ఇవ్వమని అడుగుతాడు. ఒరేయ్ వద్దు అలాంటి పనులు చెయ్యొద్దని మాధవ అంటాడు. నిన్ను అడిగి వేస్ట్ కేశవ ని అడుగుతానని చక్రి అంటాడు.
ఆ తర్వాత కేశవ త్వరగా ఇంటికి వస్తాడు. ఈ రోజు త్వరగా ఇంటికి వచ్చావ్ ఎందుకని మాధవ అడుగుతాడు. చక్రి ఫోన్ చేసాడని కేశవ అంటాడు. పాపం ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారట అని కేశవ అనగానే ఎందుకు మీరు అలాంటి విషయాలు పట్టించుకుంటున్నారని మాధవ తన తమ్ముళ్లపై కోప్పడతాడు. తరువాయి భాగంలో మహాకి చెప్పినట్లుగానే రిజిస్టర్ మ్యారేజ్ ఆపుతాడు చక్రి. దాంతో మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |